హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: నటి పూనమ్ కౌర్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియా పోస్టులతో హల్చల్ సృష్టించారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తరుచుగా పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఎవరి పేరును ప్రస్తావించకుండా ఆమె చేసిన పోస్టులు ఇప్పుడు టాలీవుడ్న్ షేక్ చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ దర్శకుడిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఏమాత్రం ఆదర్శం లేని, వంద శాతం ప్రచారం చేసుకునే ఈ దర్శకుడి నుంచి నటీనటులను, నిర్మాతలను దేవుడే కాపాడాలి. హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే ఇతను తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ వ్యక్తికి అసలు ఎలాంటి ఆదర్శం లేదు. కాబట్టి ఇతనికి దూరంగా ఉండండి. ఈ తాంత్రికుడు, నకిలీ గురువు నుంచి అమాయకులను ఆ దేవుడే కాపాడాలి’’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.
అంతటితో ఆగకుండా మరో పోస్టులో ‘‘ఏకే అనేది మరో నటుడి విషయంలో ‘అజ్ఞాతవాసి’ లాంటిది.. అంతే’’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టుల్లో పూనమ్ కౌర్ ఎక్కడా ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పూనమ్ కౌర్ చేసిన పోస్టుల్లో ‘ఆదర్శం’, ‘ఏకే’, ‘గురు’, ‘అజ్ఞాతవాసి’ వంటి పదాలు ఉండటంతో.. నెటిజన్లు వీటిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో లింక్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: ఏకే 47’ సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలోనే పూనమ్ ఈ పోస్టులు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే పూనమ్ కౌర్ తన పోస్టుల్లో ఎక్కడా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించలేదు. అందువల్ల ఈ వ్యాఖ్యలు నిజంగానే ఆయనను ఉద్దేశించేవేనా? లేక మరెవరినైనా టార్గెట్ చేశారా? అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
-
జైలర్ 2 సెన్సార్ పూర్తి.. రజినీకాంత్ మూవీ రన్‌టైమ్ ఎంతంటే?
-
దసరా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 7 వేల ప్రత్యేక బస్సులు, కొత్త సదుపాయం
-
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి నటసింహం
-
అగ్గిపెట్టి మచ్చా ఇక లేరు.. అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ కిరణ్ కుమార్ మృతి
