Homeఆంధ్ర ప్రదేశ్వివాహేతర సంబంధం తెంచుకుందని కక్ష.. మహిళ దారుణ హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

వివాహేతర సంబంధం తెంచుకుందని కక్ష.. మహిళ దారుణ హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

క్రైమ్ మిర్రర్ : వివాహేతర సంబంధాన్ని తెంచుకుందని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి, మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన విజయవాడలోని అరండల్‌పేటలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విజయవాడ అరండల్‌పేట ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వివాహితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె కుటుంబం నాగరాజు అనే వ్యక్తి ఇంట అద్దెకు ఉండేది. ఆ సమయంలో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల నాగరాజుకు వివాహం నిశ్చయమవ్వడంతో, ఆ మహిళ తన కుటుంబంతో కలిసి ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మకాం మార్చింది.

వేధింపులు.. ఆపై దారుణం

ఇల్లు మారినప్పటికీ, తనతో సంబంధాన్ని కొనసాగించాలంటూ నాగరాజు ఆ మహిళపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో, ఆమెపై తీవ్ర కోపంతో రగిలిపోయిన అతడు హతమార్చేందుకు పథకం పన్నాడు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి, కత్తితో దాడికి తెగబడ్డాడు. గొంతు కోసి, శరీరంపై తీవ్రంగా గాయపరచడంతో ఆ మహిళ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

ఆత్మహత్యాయత్నం – అరెస్టు

హత్య అనంతరం నిందితుడు నాగరాజు కూడా కత్తితో తన గొంతు, పొట్ట భాగంలో గాయాలు చేసుకుని భవనం పైనుంచి కిందకు దిగివచ్చి సమీపంలోని కాలువలో దూకాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు వింత వాదన తీసుకొచ్చాడు. బాధితురాలు తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మర్చిపోలేకపోయానని, ఆ కారణంతోనే అంతమొందించానని పోలీసులకు తెలిపాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
also read : శుద్ధీకరణ పేరుతో అమానుషం.. మహిళపై ఏడుగురి లైంగిక దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు