తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరులో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రైల్వేకోడూరుకు చెందిన 5వ తరగతి చదువుతున్న బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, 45 ఏళ్ల వ్యక్తి ఆమెను ఆటోలో ఊరి బయటకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక మరుసటి రోజు తన తల్లికి విషయం వివరించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు రైల్వేకోడూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు, సహాయం అందించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: అనంతపురంలో అమానవీయ ఘటన.. కంపచెట్టుపై అప్పుడే పుట్టిన శిశువు
