Homeఆంధ్ర ప్రదేశ్శ్రీ‌సిటిలో భారీ పేలుడు...! ఐదుగురు మృతి ....

శ్రీ‌సిటిలో భారీ పేలుడు…! ఐదుగురు మృతి ….

తిరుప‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: తిరుప‌తి జిల్లాలోని శ్రీ‌సిటీ పారిశ్రామిక వాడ‌లో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. స‌త్య‌వేడు మండ‌లం శ్రీ‌సిటిలో టిల్ హెల్త్‌కేర్ ప‌రిశ్ర‌మ‌లో బాలియ‌ర్ పేలిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. కాగా ఈ పేలుడు స‌మ‌యంలో నైట్‌షిఫ్ట్‌లో నిర్వ‌హిస్తున్న ప‌లువురు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది. ఒక్క‌సారిగా భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఆ ప్రాంతంలో భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందిన‌ట్లు తెలుస్తుంది. కొంత‌మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదం పై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. కాగా ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రెస్కూ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. కార్మికుల‌ను బ‌య‌ట‌కు తీసుకేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. శిథిలాల కింద మ‌రెవ‌రైన చిక్కుకున్నా అనే కోణంలో స‌హాయ‌క బృందాలు గాలింపు తీవ్రత‌రం చేసింది.

మృతుల వివరాలు ఇవే..

పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది. గౌరబ్‌ రాయ్‌ (35), చిన్న మస్తాన్‌ (36), రమేష్‌ (40) మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాసు (36) చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమ శకలాలు సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు విధుల్లో ఉన్నారు.. పేలుడుకు అసలు కారణం ఏమిటనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. అరుదైన వ్యాధితో పోరాడుతున్న పసివాడికి రూ.9 కోట్ల సాయం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్న అనంత్ అంబానీ
  2.  ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్..!
  3.  కారు రంగుతో మైలేజ్‌కు లింక్.. ఏ రంగు కారు కొంటే ఇంధనం ఆదా అవుతుందో తెలుసా?
  4. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు.. త్వరలోనే నేరుగా కలుస్తానంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు