Homeక్రైమ్చికెన్ వండే విషయంలో తీవ్ర గొడవ.. తల్లిదండ్రుల ఘర్షణ చూసి ఆరేళ్ల చిన్నారి షాక్‌తో మృతి!

చికెన్ వండే విషయంలో తీవ్ర గొడవ.. తల్లిదండ్రుల ఘర్షణ చూసి ఆరేళ్ల చిన్నారి షాక్‌తో మృతి!

క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా హతిహి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చికెన్ వండే విషయంలో దంపతుల మధ్య జరిగిన తీవ్ర వివాదం చూసి వారి ఆరేళ్ల కుమార్తె మహక్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తులో ఇంటికి చికెన్ తెచ్చిన ప్రమోద్ గౌతమ్ అనే వ్యక్తికి, అతడి భార్య లక్ష్మికి మధ్య వంట విషయంలో గొడవ ప్రారంభమైంది. మాటమాట పెరగడంతో ప్రమోద్ తన భార్యపై చేయి చేసుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య జరిగిన ఈ తీవ్ర ఘర్షణను కళ్లారా చూసిన ఆరేళ్ల చిన్నారి మహక్ తీవ్ర భయాందోళనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, రక్తపు మరకలు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల గొడవ చూసి కలిగిన మానసిక ఆందోళన, షాక్ వల్లే మరణించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. బాలిక తండ్రి ప్రమోద్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

also read : రేణు దేశాయ్ క్లారిటీ.. ‘నేను వ్యతిరేకించింది దానినే… గణపతి బప్పాపై నాకు ఎంతో భక్తి’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు