క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యంగా మార్కెట్‌లో నిత్యం వాడే బియ్యం ధరలు సెప్టెంబరు నెలలో కూడా అమాంతం పెరిగిపోయాయి.25 కేజీల HMT సన్న బియ్యం బ్యాగ్ ధర జులై నెలలో ₹1,670గా ఉండగా, ఆగస్టు నాటికి ₹1,850కి, తాజాగా సెప్టెంబరులో ఏకంగా ₹1,900కు చేరుకుంది. అలాగే BPT రకం బియ్యం ధర జులైలో ₹1,436గా నమోదు కాగా, ఆగస్టులో ₹1,650కి, సెప్టెంబరు వచ్చేసరికి ₹1,750కి పెరిగింది.
మరోవైపు కూరగాయల ధరలు, ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లలో రిటైల్గా కేజీ ఉల్లిపాయల ధర ₹70 నుండి ₹80 వరకు పలుకుతోంది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రైతుబజార్ల ద్వారా రాయితీపై ఉల్లి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామం.. సుమలత కార్యవర్గం రద్దు
కుక్క కాటును నిర్లక్ష్యం చేయడంతో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి
