HomeజాతీయంUPIపై MDRకు వ్యతిరేకంగా ‘నో UPI డే’.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిరసన

UPIపై MDRకు వ్యతిరేకంగా ‘నో UPI డే’.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిరసన

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన UPIపై Merchant Discount Rate (MDR) విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 2న ‘నో UPI డే’గా పాటించాలని ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు నిర్ణయించాయి.

ఈ నిరసనలో భాగంగా అక్టోబర్ 2న డిజిటల్ చెల్లింపులను స్వీకరించకుండా ఉండాలని వ్యాపార సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా దుకాణాల్లో ఏర్పాటు చేసిన UPI స్కానర్లు, QR కోడ్‌లు, సౌండ్ బాక్సులను బ్లాక్ క్లాత్‌తో కప్పి ఉంచాలని నిర్ణయించారు.

UPI లావాదేవీలపై MDR విధించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లతో చర్చించిన అనంతరం ‘నో UPI డే’ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు MH ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర తెలిపారు.

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా వ్యాపారులు ఈ నిరసనలో పాల్గొని UPI చెల్లింపులకు దూరంగా ఉండాలని సంఘాలు కోరుతున్నాయి. UPIపై MDR విధింపు అంశంపై తమ అభ్యంతరాన్ని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

also read: హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు