Homeక్రైమ్హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై అధికారులు దాడులు ముమ్మరం చేశారు. తాజాగా హయత్‌నగర్‌ పరిధిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్న కేంద్రంపై అధికారులు దాడి చేసి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (M-FAST), SOT ఎల్బీనగర్‌ బృందం, హయత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

హయత్‌నగర్‌లోని ఓ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారీ యూనిట్‌పై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను చూసి అధికారులు విస్తుపోయినట్లు తెలుస్తోంది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పేస్ట్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తూ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దాడుల్లో మొత్తం 730 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్‌కు రంగు, రుచి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్న గుర్తుతెలియని రసాయన ద్రావణంతో పాటు ఫుడ్ కలర్స్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పేస్ట్ తయారీ, విక్రయాలకు సంబంధించి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఆహార పదార్థాల కల్తీపై అధికారులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొందరు అక్రమంగా నాణ్యత లేని పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

also read: కాజీపేటలో దారుణం.. తల్లిని గొంతు కోసి చంపిన కుమారుడు.. అసలు కారణమిదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు