క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు వెంటనే bsetelangana.gov.in వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్‌లోకి వెళ్లాలని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలిపారు. అక్కడ UDISE ప్లస్ పోర్టల్ డేటాను క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, వాటిని అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు.
ఒక్కసారిగా మారిన వాతావరణం… హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!
వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి!
