Homeఆంధ్ర ప్రదేశ్వినాయక చవితి వేడుకల్లో విషాదం.. అన్నదాన కార్యక్రమం రోజు వేడి సాంబారులో పడి మహిళ మృతి

వినాయక చవితి వేడుకల్లో విషాదం.. అన్నదాన కార్యక్రమం రోజు వేడి సాంబారులో పడి మహిళ మృతి

వినాయక చవితి వేడుకల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అన్నదానం కోసం సిద్ధం చేసిన వేడి సాంబారు పాత్రను తరలించే సమయంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన విజయవాడలోని కేఎల్‌రావునగర్‌లో చోటుచేసుకుంది.

కేఎల్‌రావునగర్‌ ఐదో వీధికి చెందిన మద్ది సుజాత తన చిన్న కుమారుడితో కలిసి ఉంటున్నారు. సెప్టెంబర్‌ 20న తమ వీధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుజాత తన బంధువులతో కలిసి వంట పనుల్లో పాల్గొన్నారు.

అన్నదానం కోసం వండిన సాంబారును పొయ్యి నుంచి దించి పక్కకు తరలించే సమయంలో ప్రమాదం జరిగింది. పెద్ద పాత్రను మరో మహిళతో కలిసి తీసుకెళ్తుండగా సుజాత ఒక్కసారిగా అదుపుతప్పి వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయారు. దీంతో ఆమె ముఖం, ఛాతీతో పాటు శరీరంలోని పలు భాగాలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సోమవారం సుజాత మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పండుగ సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటనతో కేఎల్‌రావునగర్‌లో విషాదం నెలకొంది.

also read: మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడు పరార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు