మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నకొడుకుపై ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు తన వద్దకు రావడం లేదనే ఆగ్రహంతో తండ్రి అతడిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 13 రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాలుడిని నేలపై బలంగా కొట్టడంతో పాటు, అతడి చేతిని వేడి పెనంపై అదిమి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిపై కూడా నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బాలుడి తల్లి రోహిణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), జువైనల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
also read: వరంగల్‌లో దారుణం.. తమ్ముడిపై కత్తితో అన్న దాడి, తమ్ముడు మృతి
