చెన్నై,క్రైమ్మిర్రర్: తమిళనాడు సర్కార్ భోజన పథకం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. దీంతో సీఎం విజయ్ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యహ్న భోజన పథకం ద్వారా వారానికి ఒక సారి చికెన్ బిర్యాణి అందించడానికి సిద్దమైంది. కాగా తమిళనాడు సీఎం విజయ్, విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ కలిసి ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం ప్రయోగాత్మక దశలోనే ఉందని విద్య శాఖ మంత్రి రాజ్మోహన్ తెలిపారు.
Also Read:సౌది అరేబియా వారం రోజుల్లో 300 సార్లు దాడులు చేసింది…! హౌతీలు
పేద విద్యార్థులకు చికెన్బిర్యాణి అందించాలనే సదుద్దేశంతోనే ఈ పథకంకు శ్రీకారం చుట్టామని, ఒకే సారి ఈ పథకంను ప్రవేశపెట్టబోమని తెలిపారు. భద్రత, శుభ్రతలను పాటిస్తూ ఈ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చనే అవగాహన కోసం తొలుత ఎంచుకున్న కొన్ని పాఠశాలల్లోనే అమలు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. జైలు ఖైదీల కోసం కూడా చికెన్ బిర్యానీని వండి వారుస్తున్నప్పుడు.. చిన్నారుల కోసం వండలేమా అని ప్రశ్నించారు.
