Homeసినిమాలైనప్‌పై అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఇక బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు!

లైనప్‌పై అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఇక బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం కేటాయించకుండా, ఇకపై వరుసగా వేగవంతంగా షూటింగ్స్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల తన సినిమాల విడుదల మధ్య వచ్చే సుదీర్ఘ గ్యాప్‌ను తగ్గించి, అభిమానులకు తరచూ బిగ్ స్క్రీన్ వినోదాన్ని అందించవచ్చని ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ‘రాకా’ చిత్రం పనులు పూర్తయిన వెంటనే, బన్నీ తన తదుపరి క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నారు.

అందులో భాగంగా ముందుగా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు సంబంధించిన కొన్ని ప్రధాన షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేయడానికి సమాయత్తమవుతున్నారు.ఆ వెంటనే ఎలాంటి విరామం తీసుకోకుండా, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో రాబోయే మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇలా ఒకే సమయంలో బ్యాక్-టు-బ్యాక్ సినిమాల చిత్రీకరణలు పూర్తి చేస్తూ, పాన్ ఇండియా రేంజ్‌లో తన బాక్సాఫీస్ జోరును కొనసాగించాలని అల్లు అర్జున్ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతున్నారు.

జెండా మోసి చివరికలా…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు