సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
అనుదీప్, హరీశ్‌నాయుడు, స్వరూప్ అనే ముగ్గురు విద్యార్థులు కాలువలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అనుదీప్‌ను రక్షించారు.
అయితే హరీశ్‌నాయుడు, స్వరూప్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
also read: AP: మద్యం షాపులకు కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ.10 లక్షల వరకు జరిమానా
