ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం షాపుల ప్రస్తుత లైసెన్సుల రెన్యువల్ ఫీజును 10 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
మద్యం షాపుల్లో MRP కంటే అధిక ధరకు మద్యం విక్రయించినా, కల్తీ మద్యానికి పాల్పడినా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో మద్యం విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రస్తుత లైసెన్సులను రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలను లక్కీడ్రా విధానంలో కేటాయించనున్నారు. ఇందుకోసం రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం షాపులను కేటాయించనున్నారు. ఇందులో 3,396 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచగా.. 340 షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించారు. కొత్త నిబంధనలతో మద్యం షాపుల లైసెన్సుల ప్రక్రియలో పారదర్శకతతో పాటు అక్రమ విక్రయాలను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
also read: 10 సెంట్ల నాణెం.. ఇప్పుడు రూ.10 కోట్లకు పైగా! అసలు దీని వెనుక కథేంటి?
