-
నెట్టింట రెట్రో మ్యాజిక్
-
1980 నాటి జ్ఞాపకాలతో పండుగ
-
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు..
-
అదిరే లుక్ తో రేణుకా చౌదరి
-
దీనిని కూడా వదలని రాజకీయ రచ్చ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. 80స్ ఫోటో ట్రెండ్ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో నేటి ఫోటోలను.. 1980 నాటి హెయిర్ స్టైల్, రెట్రో దుస్తులు, పాతకాలపు కెమెరా ఫిల్మ్ టోన్ తో రీ క్రియేట్ చేసుకుంటున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పండగ చేసుకుంటున్నారు. రాజకీయ ఉద్దండుల వరకు అందరూ తమ జ్ఞాపకాల్లో తేలియాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అగ్రనేతలు సైతం తమ 80 నాటి వింటేజ్ లుక్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీవర్ రాజకీయ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం రేపుతోంది.
-
రేణుక భిన్నం..
అయితే స్టైల్ లో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. అందరూ ఏఐ టెక్నాలజీలో యంగ్ లుక్ లోకి మారుతుంటే.. ఆమె మాత్రం అత్యంత విలక్షణంగా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో. అందంగా, యంగ్ లుక్ లో కనిపించేందుకు అంతా ఏఐ వాడుతున్నారు.
కానీ.. నాకు అవసరం లేదంటూ 1980 కాలం నాటి సావి మేగజైన్ కవర్ పై వచ్చిన తన ఒరిజినల్ ఫోటోను షేర్ చేశారు సోషల్ మీడియాలో. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి కూడా ఈ ట్రెండ్ లో భాగస్వామ్యం అయ్యారు.
-
వెంటాడిన రాజకీయం..
అయితే ఈ సరికొత్త ట్రెండ్ విధానాన్ని సైతం రాజకీయం వెంటాడింది. సరదాగా, ఆహ్లాదకరంగా సాగిపోతున్న ఈ రెట్రో ట్రెండ్ లోకి ఎప్పటిలాగే రాజకీయ రచ్చ ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోడీని వెటకారం చేస్తూ కేరళ కాంగ్రెస్ ఒక పోస్టు పెట్టడం వివాదంగా మారింది. దీనికి తెలంగాణ బిజెపి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
ఇటలీ బార్ లోని ఓ డాన్సర్ ఫోటోను షేర్ చేస్తూ.. అప్పట్లో సోనియా గాంధీ అన్నట్లుగా ధ్వనించేలా ఘాటు కౌంటర్ ఇచ్చింది. నేరుగా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో మోదీని ఎగతాళి చేశారు. దీనికి ధీటుగా బదులిచ్చింది బిజెపి.
వాస్తవానికి ఆధునిక టెక్నాలజీ అందించిన ఈ ఏఐ టూల్స్.. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాసేపు ఒత్తిడిని మరిచి సరదాగా గడిపేందుకు ఒక అద్భుతమైన వేదిక. రంగుల దుస్తులు, పాతకాలపు హెయిర్ కట్టింగులకు నవ్వులు పూయించే ఆరోగ్యకరమైన ట్రెండ్స్ ను కూడా రాజకీయాలకు వాడేస్తుండడం విచారకరం.
