Homeక్రీడలుచెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో ఎంఎస్ ధోనీకి షేర్లు ఉన్నాయా? అసలు వాస్తవాలు, వాటా విలువ...

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో ఎంఎస్ ధోనీకి షేర్లు ఉన్నాయా? అసలు వాస్తవాలు, వాటా విలువ వివరాలివే!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీకి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధం గురించి క్రీడాభిమానులందరికీ తెలిసిందే. అయితే, తాజాగా సీఎస్‌కే ఫ్రాంచైజీలో ధోనీ వాటా (షేర్లు) అడిగాడంటూ కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై సీఎస్‌కే ఫ్రాంచైజీకి చెందిన ఒక ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ధోనీ తమను ఎప్పుడూ వాటా అడగలేదని, అసలు ఈ విషయంపై ఆయన తమను సంప్రదించనేలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది.

<a href=”https://crimemirror.com/the-paradise-in-theaters-without-a-trailer-this-is-the-real-reason/”>ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!

ఇదిలా ఉంటే, ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ‘క్రిక్‌బజ్’ నివేదిక ప్రకారం.. ధోనీకి ఇప్పటికే సీఎస్‌కేలో లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం వాటి విలువ సుమారుగా రూ. 2.6 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చు. అయితే, ఫ్రాంచైజీ మొత్తం షేర్లతో పోలిస్తే ధోనీకి ఉన్న షేర్ల సంఖ్య చాలా స్వల్పం అని చెప్పాలి. ఎందుకంటే, సీఎస్‌కే ఫ్రాంచైజీకి సంబంధించి సుమారు 3 కోట్లకు పైగా షేర్లు ప్రస్తుతం పబ్లిక్ చేతుల్లోనే ఉన్నాయి. ఈ పబ్లిక్ షేర్లతో పోలిస్తే మహీ వాటా చాలా తక్కువనే చెప్పాలి. ఇకపోతే, ఈ ప్రతిష్టాత్మక చెన్నై ఫ్రాంచైజీలో అత్యధికంగా ఎన్. శ్రీనివాసన్ కుటుంబానికే ఏకంగా 55 శాతానికి పైగా భారీ వాటా ఉండటం గమనార్హం.

ఏషనాగుల సాంగ్‌పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు