క్రైమ్ మిర్రర్, సినిమా:- నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే మంచి హైప్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఏషనాగుల కట్ట మీద.. పాట మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఈ పాటకు ఆట సందీప్ కొరియోగ్రఫీ అందించారు. అయితే పాటలోని బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు లేవంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్న పాటకు చాలా సింపుల్‌గా, నెమ్మదిగా ఉండే స్టెప్పులు పెట్టారని పలువురు కామెంట్లు చేశారు. నాని అభిమానుల్లో కొందరు కూడా కొరియోగ్రఫీపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ చిత్రబృందం నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాటలోని స్టెప్పుల విషయంలో వచ్చిన విమర్శలకు కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌ను బాధ్యుడిని చేయాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.పాటకు స్లోగా, సింపుల్‌గా ఉండే స్టెప్పులు కావాలని తానే సందీప్‌కు సూచించినట్లు దర్శకుడు వెల్లడించారు. పాటలో డ్యాన్సర్లు గాల్లో ఎగిరేలా లేదా భారీగా ఎనర్జీ చూపించేలా స్టెప్పులు ఉండకూడదని ముందే చెప్పానన్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో జరిగే సాధారణ బరాత్ తరహాలో సహజంగా కనిపించే మూమెంట్స్ ఉండాలని తానే కోరుకున్నట్లు వివరించారు.
అంతేకాదు, పాట విడుదలైన వెంటనే ఈ తరహా విమర్శలు వస్తాయని తనకు ముందే తెలుసని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత ప్రేక్షకులు పాటను, అందులోని స్టెప్పులను ఆస్వాదించడం మొదలుపెడతారని తాను నమ్మినట్లు చెప్పారు. ప్రస్తుతం అదే జరుగుతోందని, మొదట్లో వచ్చిన విమర్శలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదని అన్నారు.మొత్తానికి ఏషనాగుల కట్ట మీద.. పాట విషయంలో వచ్చిన విమర్శలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. స్టెప్పులపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వెనుక కొరియోగ్రాఫర్ తప్పిదం లేదని, అది పూర్తిగా తన క్రియేటివ్ నిర్ణయమేనని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
