క్రైమ్ మిర్రర్ : చైనాలోని ఓ పోర్టులో నిలిపి ఉంచిన కార్గో నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన నౌకను లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఓషియన్ మెలోడీ’గా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
నౌకను మరమ్మతుల నిమిత్తం పోర్టులో నిలిపి ఉంచిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు నౌకలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
మరికొందరు నౌకలో చిక్కుకుపోయి లేదా గల్లంతై ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పందించి, గల్లంతైన వారి కోసం ముమ్మరంగా శోధించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
also read :జుట్లు పట్టుకుని కొట్టుకున్న ప్రయాణికులు, లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది
