Homeక్రైమ్కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు.. సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు

కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు.. సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసినట్లు సమాచారం.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘర్షణ సందర్భంగా తమ పట్ల నలుగురు నేతలు అసభ్యంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారు టీషర్టులు విప్పి తమ ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఆమె ఆరోపించినట్లు సమాచారం.

మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదును స్వీకరించిన సైఫాబాద్ పోలీసులు.. అందులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన రచ్చ.. మేరీ కోమ్, రితి తివారీ మధ్య మాటల యుద్ధం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు