Homeక్రైమ్పాము కాటుకు 12 ఏళ్ల బాలుడు మృతి..

పాము కాటుకు 12 ఏళ్ల బాలుడు మృతి..

క్రైమ్ మిర్రర్ : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి పొలానికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాంతీర్థం గ్రామానికి చెందిన నాగేశ్, పార్వతి దంపతుల కుమారుడు సూర్యతేజ (12) కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తల్లితో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో సూర్యతేజను పాము కాటేసినట్లు సమాచారం. పాము కాటుకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి బాలుడిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునేలోపే సూర్యతేజ మృతి చెందినట్లు సమాచారం. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గ్రామంలోనూ విషాద ఛాయలు నింపింది.
also read : రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఆర్‌ఓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు