Homeక్రైమ్రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఆర్‌ఓ

రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఆర్‌ఓ

క్రైమ్ మిర్రర్ : నారాయణపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేసి ఎస్‌ఆర్‌ఓ వెంకటస్వామిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇంటి రిజిస్ట్రేషన్‌ కోసం బాధితుడి నుంచి మొత్తం రూ.50 వేల నగదు ఇవ్వాలని ఎస్‌ఆర్‌ఓ కోరినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే మిగిలిన రూ.30 వేలు కూడా ఇవ్వాలని అధికారి కోరడంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు.

ఫిర్యాదు అందుకున్న మహబూబ్‌నగర్ డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలోని ఏసీబీ బృందం నారాయణపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉచ్చు వేసింది. బాధితుడు రూ.30 వేల నగదును ఎస్‌ఆర్‌ఓకు అందజేస్తున్న సమయంలో అధికారులు అక్కడికి చేరుకుని వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ వ్యక్తి నాగేష్‌ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకటస్వామి, నాగేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
also read : డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో నవజాత శిశువు మృతదేహం కలకలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు