Homeతెలంగాణసురేఖకు రాఖీ కట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్!

సురేఖకు రాఖీ కట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- నకిరేకల్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు కుటుంబ విలువలు, సంస్కారం ఉన్నందునే ఆడబిడ్డలైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీ కట్టేందుకు తన ఇంటికి వస్తే ఆప్యాయంగా స్వీట్ తినిపించి మర్యాదలు చేశానని తెలిపారు.కానీ కేటీఆర్‌కు ఎలాంటి సంస్కారం లేదని సీఎం మండిపడ్డారు. రాఖీ కడితే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో, తోడబుట్టిన చెల్లిని మెడ పట్టుకుని బయటకు గెంటిన దుర్మార్గుడు కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు.”నీలాంటి వ్యక్తితో నాకు పోలిక ఏంటి? నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం వచ్చినంత మాత్రాన నువ్వేం గొప్పవాడివి అయిపోవు” అంటూ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం సీఎం చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

యువతి కోసం స్నేహితున్నే దారుణంగా చంపాడు..

పది రోజుల తర్వాత టన్నెల్ నుంచి చైనా వ్యక్తి సజీవంగా బయటకు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు