Homeక్రీడలురోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత క్రికెట్ జట్టు వన్డే మరియు టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన సోషల్ మీడియా వార్తలపై బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి. రోహిత్ శర్మ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడంటూ వస్తున్న రకరకాల రూమర్లలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన కీలక బోర్డు మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.ఈ సందర్భంగా దేవజిత్ సైకియా మాట్లాడుతూ, రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారని, చివరి మ్యాచ్‌లోనూ అద్భుతమైన సెంచరీతో 130 పరుగులు సాధించి తన సత్తా ఏంటో నిరూపించారని గుర్తుచేశారు. ఒక ఆటగాడు నిలకడగా రాణిస్తున్నప్పుడు ఇలాంటి తప్పుడు ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కేవలం రాబోయే సిరీస్‌లలో జట్టు ప్రణాళికలు, ఎలా ఆడాలనే అంశాలపై మాత్రమే ఈరోజు బోర్డు మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న వదంతులను అభిమానులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

బీసీ బిడ్డ కాబట్టే తొలగించారు: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు