క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-– తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ప్రతిపక్ష నేత కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు రాజీనామాలు చేయడం కొత్తేమీ కాదని, ఆయన రాజీనామా చేస్తే ఆ దెబ్బకు ఢిల్లీ పీఠం వణుకుతుందని ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటి సవాల్ విసిరారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామా చేస్తే దేశ రాజధాని ఢిల్లీ వణికిపోయింది. ఆ రోజు సోనియా గాంధీ సైతం భయపడితెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కేసీఆర్ ఒకవేళ ఇప్పుడు రిజైన్చేస్తే, ఆ దెబ్బను తట్టుకునే శక్తి మీ నాయకురాలికే (సోనియా గాంధీ) లేదు, ఇక నీకుందా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. పదవుల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆశపడలేదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ఆయన పోరాటం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
వినాయక చవితికి తెలంగాణ పోలీసుల సైబర్ అలర్ట్.. గణేశుడి రూపంలో కీలక సందేశం!
శాంతిభద్రతలపై తీవ్ర ఆరోపణలు:-
రాజకీయ విమర్శలతో పాటు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై కూడా కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో మంత్రుల కొడుకులు బహిరంగంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని విమర్శించారు. అలాగే, ఇతర పార్టీల ఎంపీల కొడుకులు తమ ఖరీదైన వాహనాలతో అమాయకులను గుద్ది చంపినా పోలీసులు నిందితులను రక్షిస్తున్నారని, బాధితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. సామాన్యులకు ఒక న్యాయం, అధికారంలో ఉన్నవారికి మరొక న్యాయం అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, రాష్ట్రంలో గాడితప్పిన పాలనను, క్షీణిస్తున్న శాంతిభద్రతలను చక్కదిద్దడంపై తక్షణమే దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.
