Homeక్రైమ్ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యల కేసు- జగదీశ్వరరెడ్డిని మృతిపై అనుమానం.. సైనైడ్‌తో హత్య చేశారా?

ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యల కేసు- జగదీశ్వరరెడ్డిని మృతిపై అనుమానం.. సైనైడ్‌తో హత్య చేశారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల మరణాల వ్యవహారాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతి కేసు కూడా కొత్త మలుపు తిరిగింది.

జగదీశ్వరరెడ్డి మృతి సహజంగా సంభవించలేదని, ఆయనను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధిక్ ఖాన్ అనే వ్యక్తి సైనైడ్ అందించి జగదీశ్వరరెడ్డిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

ఈ ఘటనలో సౌజన్య పాత్ర కూడా ఉండొచ్చని ఆమె తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సౌజన్యకు ఉన్న సంబంధం, సాధిక్ ఖాన్‌తో ఆమెకు ఉన్న పరిచయాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కేసులోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ఆధారాలు, అనుమానితుల వాంగ్మూలాలు, గత పరిణామాలను పరిశీలిస్తున్నారు. సాధిక్ ఖాన్‌ను నేడు కోర్టులో హాజరుపరిచి, మరింత విచారణ కోసం వారం రోజుల పోలీస్ కస్టడీ కోరనున్నట్లు సమాచారం.

ఈ కేసులో సాధిక్ ఖాన్ పాత్రపై మరింత స్పష్టత రావడంతో పాటు, జగదీశ్వరరెడ్డి మృతి వెనుక అసలు కారణాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

also read: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…! యువ‌కుడి మృతి…

తాజావార్తలు