HomeUncategorizedగోషామహల్ బరిలో బీజేపీ మ‌హిళా నేత‌...?

గోషామహల్ బరిలో బీజేపీ మ‌హిళా నేత‌…?

  • గత ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి

  • తాజాగా రాజా సింగ్ స్థానంలో ఆమె ఎంపిక

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గోషామహల్ పై బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా? ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో ఉందా? ఇక రాజాసింగ్ కు దారులు మూసుకుపోయినట్టేనా? మహిళా నేత ను దాదాపు ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

బిజెపికి దూరంగా రాజాసింగ్…

Also Read:పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత…!

గత కొంతకాలంగా బిజెపి కి దూరంగా ఉంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక సమయంలో తీవ్ర మనస్థాపానికి గురైన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో హై కమాండ్ ఆ రాజీనామాను ఆమోదించింది. అప్పటినుంచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు రాజా సింగ్. ఒకవైపు పార్టీ సిద్ధాంతాలను పాటిస్తున్న నేతగా తనంతట తాను చెప్పుకుంటూ వస్తున్న రాజా సింగ్.. రాష్ట్ర నాయకత్వం పై మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా తిరిగి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణలో జనసేనకు భవిష్యత్తు ఉంది అంటూ వ్యాఖ్యానించడం ద్వారా బిజెపి ఆగ్రహానికి కారణం అయ్యారు రాజా సింగ్. దీంతో రాజా సింగ్ మళ్లీ బిజెపి లోకి రావడం అనేది జరగని పని అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బిజెపి హై కమాండ్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

విస్తృత పర్యటనలు…

Also Read:కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు

ఇటీవల గోషామహల్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు మహిళా నేత మాధవి లత. ఆమె బిజెపిలో చాలా యాక్టివ్ గా పని చేస్తూ వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె గోషమా హాల్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. రాజాసింగ్ పై విమర్శలు కూడా చేస్తున్నారు. మంచి వాగ్దాటితో పాటు ప్రజల్లోకి బలంగా వెళ్లగలరు కూడా. అందుకే ఆమె వైపు బిజెపి హై కమాండ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు