క్రైమ్ మిర్రర్, సినిమా:- హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ కీలక విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ఓ పాడ్‌కాస్ట్‌లో తన గత రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ, ఆ బంధం తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని వెల్లడించారు. దాదాపు రెండేళ్ల పాటు తాను ఎంతో ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మలయాళ చిత్రం ప్రేమమ్ తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అనుపమ.. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన నటనతో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.గతంలో ఓ ప్రముఖ నటుడి కుమారుడితో అనుపమ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వీరిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై అనుపమ ఎప్పుడూ స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. తాజాగా పాడ్‌కాస్ట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి తన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది.
తన గత బంధం గురించి మాట్లాడుతూ, భాగస్వామి పక్కన ఉన్నప్పుడు సాధారణంగా ప్రశాంతత, భద్రత కలగాలని భావిస్తామని అనుపమ తెలిపారు. కానీ తన విషయంలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురైందని చెప్పారు. బంధంలో ఉన్న సమయంలో ప్రతిక్షణం భయం, ఆందోళనతో గడిపినట్లు వెల్లడించారు. తనకు మానసికంగా హానికరమైన ప్రవర్తన ఎదురైందని వివరించారు.మొదట్లో ఎంతో ప్రేమ, శ్రద్ధ చూపించి తనను ప్రత్యేకంగా భావించేలా చేశారని, ఆ తర్వాత ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని అనుపమ తెలిపారు. తప్పు చేసిన తర్వాత క్షమాపణ చెప్పడం, మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం జరిగేదని చెప్పారు. చివరకు ఆ బంధం తన జీవితాన్ని, కెరీర్‌ను ప్రభావితం చేస్తోందని గుర్తించినట్లు వివరించారు.ఆ ఒత్తిడి కారణంగా కొన్ని అవకాశాలను వదులుకున్నానని, స్నేహితులకు కూడా దూరమయ్యానని అనుపమ పేర్కొన్నారు. తన కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోయానని తెలిపారు. పరిస్థితి నుంచి బయటపడేందుకు వైద్య సహాయం తీసుకున్నట్లు కూడా వెల్లడించారు.
అయితే తాను ఆ బంధం నుంచి బయటకు రావడం తన జీవితంలో కీలక నిర్ణయమని అనుపమ అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఒకవేళ ఆ సమయంలో పెళ్లి జరిగి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేదని, చివరకు విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉండేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
