Homeక్రైమ్పెళ్లి రోజే షాకింగ్ ఘటన.. భార్యను ‘బేరం’ పెట్టిన యువకుడు!

పెళ్లి రోజే షాకింగ్ ఘటన.. భార్యను ‘బేరం’ పెట్టిన యువకుడు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు, అదే రోజున తన భార్యను ఆమె కుటుంబ సభ్యులకు ‘బేరం’ పెట్టినట్లు సమాచారం.

గొల్లపల్లికి చెందిన రాజేశ్వరి, కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందిన మధు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరువురూ కుటుంబాల అనుమతితో ఇటీవల వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

సమాచారం ప్రకారం, మధు పెళ్లి రోజే రాజేశ్వరి తల్లికి ఫోన్ చేసి షాక్ ఇచ్చాడు. రాజేశ్వరిని తిరిగి అప్పగించాలంటే రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ విషయంలో తమపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని కూడా కండీషన్ పెట్టినట్లు సమాచారం.

ఈ పరిణామంతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని సమసిపెట్టేందుకు వారు రూ.6 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. విషయం బయటపడడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

also read: గాంధీనగర్‌లో దారుణం: హోటల్‌లో 17 ఏళ్ల బాలిక మృతి… ప్రియుడు అరెస్ట్

తాజావార్తలు