మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మహాల్ ప్రాంతంలోని బడ్కాస్ చౌక్ వద్ద ఓ వ్యక్తిపై అపరిచితుడు కత్తితో అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, బాధితుడు రోడ్డుపై ఉండగా గుర్తుతెలియని వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనను చూసిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపును వేగవంతం చేశారు.
ఈ దాడి వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలా? లేక ఇతర కారణాలా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
also read: విశాఖలో AAA సినిమాస్.. కొత్త ఎయిర్‌పోర్ట్‌పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!
