క్రైమ్ మిర్రర్, సినిమా:- తెలుగు సినీ పరిశ్రమలో విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ శ్రీను.. తన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణంతో పాటు స్టార్ హీరో ప్రభాస్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ప్రభాస్‌ను తొలిసారి వైజాగ్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో కలిసినప్పటి నుంచే తమ స్నేహం మొదలైందని ప్రభాస్ శ్రీను తెలిపారు. ప్రభాస్ చుట్టూ ఎప్పుడూ 10 నుంచి 15 మంది స్నేహితులు ఉంటారని, అయితే తమ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధాన్ని మాటల్లో వివరించడం తనకు సాధ్యం కాదని చెప్పారు. అది ఒక దైవ సంబంధం లాంటిదని, అనుభవించాల్సిన బంధమని పేర్కొన్నారు.ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆయన కృత్రిమంగా నవ్వరని, నచ్చిన విషయాన్ని ఎంతో బోల్డ్‌గా, మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని శ్రీను తెలిపారు. చుట్టూ ఉన్న వ్యక్తులను, పరిస్థితులను ప్రభాస్ చాలా నిశితంగా గమనిస్తారని, ఆయన ఎంతో తెలివైన వ్యక్తి అని ప్రశంసించారు. తాము పక్కన ఉంటే చాలు ప్రభాస్ సంతోషిస్తారని, అదే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్…!
ప్రభాస్‌ను తాను దేవుడితో సమానంగా భావిస్తానని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. అందరితో తాను కలవలేనని, ఎక్కడా పూర్తిగా సెట్ అవ్వలేనని చెప్పిన ఆయన.. ప్రభాస్ దగ్గర మాత్రమే తనకు ఎంతో హాయిగా ఉంటుందని తెలిపారు. తాను ప్రభాస్‌కు కేవలం స్నేహితుడిని మాత్రమే కాదని, ఆయనతో కలిసి ప్రయాణించడం, షూటింగ్స్‌కు వెళ్లడం, షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి రావడం తన జీవితంలో భాగమైపోయిందని చెప్పారు.తమ బంధానికి డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని శ్రీను స్పష్టం చేశారు. ప్రభాస్‌కు విశాలమైన మనసు ఉందని, అవసరమైన వారికి భారీగా సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనదని చెప్పారు. అయితే తమ అనుబంధాన్ని డబ్బుతో ఎప్పటికీ కొలవలేమని పేర్కొన్నారు. ప్రభాస్ తనపై ఉంచే నమ్మకం, ఇచ్చే ధైర్యమే తనకు ఎంతో విలువైనవని తెలిపారు.తనకు ప్రభాస్ ఇచ్చే గౌరవం, నమ్మకం ఒక పెద్ద కొండ లాంటిదని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆయన తనకు ఎన్నో ఇచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ, తాను మాత్రం తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటానని చెప్పారు. మొత్తంగా ప్రభాస్ శ్రీను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. స్టార్ హీరోతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధంపై అభిమానులు కూడా స్పందిస్తున్నారు.
