Homeసినిమారీ-రిలీజ్‌లో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ సరికొత్త రికార్డు.. ‘బాహుబలి’ని దాటేసింది!

రీ-రిలీజ్‌లో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ సరికొత్త రికార్డు.. ‘బాహుబలి’ని దాటేసింది!

మార్వెల్ అభిమానులకు మరోసారి థియేటర్లలో సందడి చేసే అవకాశం దక్కింది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ పేరుతో రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్ సాధించింది. రీ-రిలీజ్ సినిమాల తొలి రోజు వసూళ్ల విషయంలో ఇప్పటివరకు ఉన్న రికార్డును ఈ మూవీ అధిగమించింది.

శుక్రవారం ఒక్కరోజే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ దేశవ్యాప్తంగా రూ.7.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో రీ-రిలీజ్ సినిమాల ఓపెనింగ్ డే వసూళ్లలో రూ.5 కోట్లతో ఉన్న ‘బాహుబలి: ది ఎపిక్’ రికార్డు వెనుకబడిపోయింది.

భారత్‌లో సుమారు 3,600 స్క్రీన్లలో ఈ సినిమాను మళ్లీ విడుదల చేశారు. ముఖ్యంగా ఇంగ్లిష్ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఉన్న భారీ ఫ్యాన్‌బేస్ కారణంగా రీ-రిలీజ్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలకమైన చిత్రంగా గుర్తింపు పొందిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఇప్పటికీ ఉన్న క్రేజ్‌ను ఈ వసూళ్లు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రీ-రిలీజ్ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

also read: నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. రెండు రోజుల్లో 19 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు