Homeక్రైమ్మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని భార్యాభర్తలు మృతి

మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని భార్యాభర్తలు మృతి

పోలవరం జిల్లాలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం చీకటిగొప్పుల సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. కోరుకొండ మండలం రాఘవపురానికి చెందిన శ్రీను, శోభారాణి దంపతులు బైక్‌పై మారేడుమిల్లికి విహారయాత్రకు వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో చీకటిగొప్పుల సమీపంలో ఎదురుగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు దంపతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంకు చెందిన కారు ఈ ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: చైనాలో టార్చ్ ఫెస్టివల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 16 మందికి గాయాలు

తాజావార్తలు