Homeక్రైమ్ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నవార్ సమీపంలోని పంచక్ వాసా ప్రాంతంలో కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వాటిని పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ఉజ్జయిని వైపు నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురూ గుజరాత్‌కు చెందినవారేనని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, మృతుల పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
also read : ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన అల్లుడు.. అసలు విషయం తెలిస్తే షాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు