Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

క్రైమ్ మిర్రర్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ చౌరస్తాలోని మదీనా చికెన్ సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న డీసీఎంను స్కూటీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను, గాయపడిన వ్యక్తిని సంబంధిత ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, తీవ్రంగా గాయపడిన వ్యక్తితో పాటు ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం కూడా రంగాయపల్లి ప్రాంతంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ పరిశ్రమకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, మృతుల వివరాలు, గాయపడిన వ్యక్తి పరిస్థితిపై పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ ఆర్థిక భరోసా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు