క్రైమ్ మిర్రర్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ సంరక్షణ కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.
పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాలతో పాటు కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులోనూ పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తైన తర్వాత జిల్లా పార్టీ నాయకులు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి తదుపరి చర్యలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టబోమని, ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
also read : “తాగిన మత్తులోనే సూసైడ్ నోట్ రాశా.. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియదు!”
