Homeక్రైమ్పసికందును ఎత్తుకెళ్లిన వాచ్ వుమెన్... 3 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు

పసికందును ఎత్తుకెళ్లిన వాచ్ వుమెన్… 3 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు

హైదరాబాద్ నగర పరిధిలో అపహరణ ఘటన కలకలం రేపినా, పోలీసుల వేగవంతమైన చర్యలతో ఎనిమిది నెలల పసికందు సురక్షితంగా బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బోడుప్పల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మేడిపల్లి పోలీసులు కేవలం మూడు గంటల్లోనే కేసును ఛేదించి ప్రశంసలు అందుకున్నారు.

స్థానికంగా ఓ ఇంట్లో వాచ్‌వుమన్‌గా పనిచేస్తున్న మహిళ, ఆ ఇంట్లో ఉన్న శిశువును అకస్మాత్తుగా తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు అత్యవసరంగా స్పందించారు.

ఉప్పల్ డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి, అనుమానితురాలి కదలికలను గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ముఖ్య రైల్వే స్టేషన్లకు అలర్ట్ జారీ చేయడంతో పాటు, ఇతర జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితురాలి మార్గాన్ని పోలీసులు గుర్తించారు.

చివరకు కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో అనుమానితురాలిని అదుపులోకి తీసుకుని, పసికందును సురక్షితంగా రక్షించారు. అనంతరం అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి, చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసుల వేగం, సమన్వయం ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరిచింది.

also read: హైదరాబాద్‌లో కలకలం: చెత్తకుండీలో కాలిపోయిన మహిళ మృతదేహం గుర్తింపు

తాజావార్తలు