క్రైమ్ మిర్రర్ : ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం, దేవ్‌ప్రయాగ్ నుంచి పౌరీ వైపు వెళ్తున్న బొలెరో వాహనం కుంద్ధర్ సమీపంలోని సబ్దర్ఖాల్ వద్ద అదుపుతప్పి సుమారు 250 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వాహనంలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా, ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన అర్మాన్‌ను రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులను హరిద్వార్ జిల్లా రాయ్‌పూర్ జీత్పూర్కు చెందిన అఫ్జల్ (49), ఆయన భార్య షబ్బో (40), వారి మూడేళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు, అలాగే గుఫ్రాన్ (34)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read : కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి
లోయలో పడిన బొలెరో.. ఐదుగురు మృతి
0
12
