Homeతెలంగాణఆలయ పునర్నిర్మాణంపై అర్చకుల స్పష్టత..!

ఆలయ పునర్నిర్మాణంపై అర్చకుల స్పష్టత..!

– సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
– ఆలయ పునర్నిర్మాణానికి మేమంతా పూర్తి మద్దతు : ఆలయ అర్చకులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని అర్చకులు వ్యతిరేకిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. ఆలయాన్ని కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా మరింత వైభవంగా పునర్నిర్మించడం తమకు గర్వకారణమని తెలిపారు. ఆగమ శాస్త్ర నిపుణులు, వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, శృంగేరి జగద్గురువుల మార్గదర్శకత్వంలో శాస్త్రోక్తంగా పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యాభిషేకాలు, నిత్యార్చనలు, ఇతర పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్చకులు భావోద్వేగానికి గురయ్యారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనగంటి పనీంద్ర శర్మ, ముఖ్య అర్చకులు ఆరుట్ల రామాచార్యులు, అర్చకులు గట్టు రాము, రామకృష్ణ, శరత్ చంద్ర శర్మ, పవన్ శర్మ, విజయ్ శర్మ, రాజు శర్మ, ఫణి శర్మ, రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు చిరు శాశ్వత దూరం!

గాల్లో విమానం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం, అరెస్ట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు