క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన అధికార ‘యునైటెడ్ రష్యా పార్టీ’ (URP) మళ్లీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార URP పార్టీ ఏకంగా 57.83 శాతం ఓట్లను సాధించి ప్రభంజనం సృష్టించింది.
సర్కారీ వైద్యం, విద్యపై ప్రజాప్రతినిధుల అలసత్వం: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తీవ్ర ఆరోపణలు
గత ఎన్నికలతో పోలిస్తే పుతిన్ నేతృత్వంలోని పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీకి 49.8 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈసారి ఏకంగా 8 శాతం మేర ఓటింగ్ శాతం పెరగడం గమనార్హం.
ఈ చారిత్రాత్మక విజయంతో రష్యా పార్లమెంట్‌కు చెందిన దిగువ సభ అయిన ‘స్టేట్ డుమా’లో మొత్తం ఉన్న 450 స్థానాలకు గానూ, అధికార పార్టీ ఏకంగా 355 సీట్లను దక్కించుకోనుంది. దీంతో పార్లమెంట్లో పుతిన్ పార్టీకి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజారిటీ లభించింది. ఈ భారీ విజయంతో రాబోయే రోజుల్లో రష్యా చట్టసభలపై అధికార పార్టీ పూర్తి ఆధిపత్యం కొనసాగనుంది.
అమెరికా దాడి ముప్పు.. సాయుధ దళాలను తీవ్ర అప్రమత్తం చేస్తూ ఇరాన్ ‘కోడ్ 100’ నిర్ణయం
