Homeక్రైమ్భార్య ఫిర్యాదు చేసిందని మనస్తాపం.. పోలీస్‌స్టేషన్‌లోనే భర్త ఆత్మహత్యాయత్నం

భార్య ఫిర్యాదు చేసిందని మనస్తాపం.. పోలీస్‌స్టేషన్‌లోనే భర్త ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. భార్య తనపై ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. పోలీసుల సమక్షంలోనే బ్లేడుతో గొంతు, చేతికి గాయాలు చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలగాం గ్రామానికి చెందిన కిమిడి శ్రీలత, కిమిడి సునీల్‌ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ సమస్యలు కొనసాగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక శ్రీలత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు విచారణలో భాగంగా సునీల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. మంగళవారం సాయంత్రం ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ ఇద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉండగానే.. తనపై భార్య ఫిర్యాదు చేసిందనే విషయం తెలుసుకున్న సునీల్‌ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు.

ఎవరూ ఊహించని విధంగా తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు, చేతిపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని 108 వాహనంలో రాజాం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం సునీల్‌కు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతోందని, అతడి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ పేర్కొన్నారు.

also read: Naveen Ansal Inspiring Story: 33 ఏళ్లకే ఆస్తులు కోల్పోయిన వ్యాపారవేత్త ఎలా మారిపోయారంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు