క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) కీలక విజ్ఞప్తులు చేశారు. ఓట్ల తొలగింపు విషయంలో అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.తాజాగా ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SSR ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తొలగించేందుకు సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను వెంటనే అన్ని రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు. అలాగే, ‘అన్ మ్యాప్డ్’ మరియు ‘నాట్ ట్రేస్డ్’ ఓటర్ల జాబితాలను కూడా పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల రాజకీయ పార్టీలు ఆయా జాబితాలను పరిశీలించి, తప్పులు ఉంటే సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియాలో మైనర్లపై సోషల్ మీడియా బ్యాన్ విఫలం: eSafety సంచలన నివేదిక!
తొందరపాటు చర్యలతో ఎలాంటి విచారణ లేకుండా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించవద్దని ఆయన అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతే అనర్హుల ఓట్లను తొలగించాలని సూచించారు. ఇక ఓటర్ల సౌలభ్యం కోసం మరో కీలక సూచన కూడా చేశారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరి ఓట్లు, అలాగే ఒకే వీధిలోని ఓట్లన్నీ ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల పోలింగ్ రోజున ఓటర్లు ఇబ్బందులు పడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఈసీ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
పెనమలూరు వంతెన వద్ద విషాదం.. మృతదేహం వెలికితీసేందుకు వెళ్లిన యువకుడు గల్లంతు
