Homeక్రైమ్'సై' విలన్ ఇకలేరు.. నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మృతి

‘సై’ విలన్ ఇకలేరు.. నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మృతి

క్రైమ్ మిర్రర్ : తెలుగు, హిందీ, తమిళం సహా పలు భారతీయ భాషల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ కన్నుమూశారు. ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రదీప్ రామ్ సింగ్ రావత్ టెలివిజన్ రంగంలో తన నట జీవితాన్ని ప్రారంభించి, అనంతరం సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ సినిమా విజయంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు పోషించిన ఆయన, తన గంభీరమైన హావభావాలు, ప్రత్యేక నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. విలన్ పాత్రలకు కొత్తదనాన్ని తీసుకొచ్చిన నటుడిగా సినీ వర్గాల్లో పేరు సంపాదించారు. ప్రదీప్ రామ్ సింగ్ రావత్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
also read : నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయలు కొట్టే కత్తితో దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు