Homeక్రీడలుక్రికెట్ కు గుడ్ బై చెప్పిన రహానే... కోహ్లీ ఎమోషనల్ ట్వీట్!

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రహానే… కోహ్లీ ఎమోషనల్ ట్వీట్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత క్రికెట్ జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ సెండాఫ్ పలుకుతున్నారు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించారు.రహానేతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లీ, “ఇండియన్ క్రికెట్‌లో ఎన్నో వండర్స్ సృష్టించావు. జింక్స్ (రహానే ముద్దుపేరు) నా ఫేవరెట్ టెస్ట్ బ్యాటింగ్ పార్టనర్. నీ జర్నీ పట్ల నువ్వు ఎంతో గర్వపడొచ్చు” అని ట్వీట్ చేశారు. కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రిషబ్ పంత్, మరియు ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తదితరులు రహానేకు అభినందనలు తెలియజేశారు.రహానే కెరీర్‌లో అత్యంత మరుపురాని ఘట్టమైన, ఆస్ట్రేలియా గడ్డపై కెప్టెన్‌గా టెస్ట్ సిరీస్ గెలిచినప్పటి వీడియోను బిసిసిఐ (BCCI) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.

హెచ్చరిక: చిన్నపిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా? ఈ అనర్థాలు తెలుసుకోండి!

ఐదు రోజుల్లో చోరీ కేసు ఛేదన..100గ్రాముల బంగారం రికవరీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు