Homeలైఫ్ స్టైల్హెచ్చరిక: చిన్నపిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా? ఈ అనర్థాలు తెలుసుకోండి!

హెచ్చరిక: చిన్నపిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా? ఈ అనర్థాలు తెలుసుకోండి!

క్రైమ్ మిర్రర్,హెల్త్:- మీరు ముద్దుగా మీ పిల్లలకు టీ లేదా కాఫీ తాగిస్తున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మానుకోండి. 12 ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం వారి ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ గౌతమ్ హెచ్చరిస్తున్నారు.ఇనుము లోపం మరియు రక్తహీనత:టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధిక మోతాదులో ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల వారి శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందని, తద్వారా రక్తహీనత సమస్య తలెత్తుతుందని డాక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. పెరుగుతున్న పిల్లలకు ఐరన్ చాలా అవసరం, ఇది లోపిస్తే వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఇతర ఆరోగ్య సమస్యలు:కేవలం రక్తహీనత మాత్రమే కాకుండా, పిల్లల్లో మరికొన్ని సమస్యలకు కూడా టీ, కాఫీలు కారణమవుతాయని ఆయన వివరించారు. వీటిని తాగడం వల్ల పిల్లలకు ఆకలి వేయదు, తద్వారా వారు పౌష్టికాహారం తీసుకోలేరు. కెఫిన్ ప్రభావంతో పిల్లలు అతి చురుకుగా (హైపర్ యాక్టివ్) మారిపోతారు. నిద్రలేమి సమస్యలు తలెత్తి, వారి రోజువారీ జీవనశైలి దెబ్బతింటుంది.

తల్లిదండ్రులకు సూచన:-
పిల్లల భవిష్యత్తు మరియు ఆరోగ్యం దృష్ట్యా, టీ, కాఫీలకు వారిని వీలైనంత దూరంగా ఉంచాలని డాక్టర్ గౌతమ్ తల్లిదండ్రులకు సూచించారు. వాటికి ప్రత్యామ్నాయంగా పాలు, పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను అలవాటు చేయాలని సలహా ఇచ్చారు.

ఐదు రోజుల్లో చోరీ కేసు ఛేదన..100గ్రాముల బంగారం రికవరీ!

కన్న కూతురిపైనే ఏడాది పాటు లైంగిక దాడి.. పోక్సో కేసులో తండ్రికి రిమాండ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు