Homeతెలంగాణఐదు రోజుల్లో చోరీ కేసు ఛేదన..100గ్రాముల బంగారం రికవరీ!

ఐదు రోజుల్లో చోరీ కేసు ఛేదన..100గ్రాముల బంగారం రికవరీ!

క్రైమ్ మిర్రర్,మాదాపూర్:- మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును మాదాపూర్ పోలీసులు వేగంగా ఛేదించారు.ఫిర్యాదుదారురాలు కోడలి సోదరి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం బాధిత కుటుంబానికి తిరిగి అప్పగించే చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.ఈ కేసును మాదాపూర్ డీ ఐ పీ . రమేష్ పర్యవేక్షణలో, ఎస్ ఎచ్ ఓ కే వి . సుబ్బారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.మాదాపూర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇంటి పనివారు, బంధువులు లేదా ఇతర వ్యక్తులు ఇంట్లోకి వచ్చేటప్పుడు విలువైన ఆభరణాలు, నగదును సురక్షితంగా భద్రపరచాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.

<a href=”https://crimemirror.com/wife-ran-off-with-her-lover-husband-eventually-got-them-married/”>ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు వారిద్దరికీ పెళ్లి చేసిన భర్త

యూనిఫామ్ ముసుగులో దారుణం.. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కానిస్టేబుల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు