Homeలైఫ్ స్టైల్AMB సినిమాస్‌లో వారణాసి జోడీ సందడి...!

AMB సినిమాస్‌లో వారణాసి జోడీ సందడి…!

 Crime Mirror,Cinema Updates: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కాస్త విరామం తీసుకుని హైదరాబాద్‌లో మూవీ నైట్‌ను ఆస్వాదించారు. వీరితో పాటు ప్రియాంక చోప్రా భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ కూడా పాల్గొనడంతో ఈ మూవీ నైట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని AMB సినిమాస్ కు వచ్చిన ఈ ముగ్గురిని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం AMB సినిమాస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ప్రత్యేక పోస్ట్ చేసింది.

The Globe Trotter Superstar మహేష్ బాబు, Desi Girl Mandakini ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ రాకతో మా మూవీ నైట్ మరింత ప్రత్యేకంగా మారింది. మీకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. మళ్లీ త్వరలో కలుద్దాం అంటూ AMB సినిమాస్ పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనాస్‌తో కలిసి మహేష్ బాబుతో మూవీ నైట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే వారు ఏ సినిమాను వీక్షించారనే విషయాన్ని మాత్రం AMB సినిమాస్ వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. మరోవైపు పాపరాజీలు చిత్రీకరించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ముఖ్యంగా AMB సినిమాస్ తమ పోస్ట్‌లో మహేష్ బాబును The Globe Trotter Superstar, ప్రియాంక చోప్రాను ఆమె సినిమా పాత్ర పేరుతో కలిపి Desi Girl Mandakini అని సంబోధించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫొటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు