-
లంచగొండి అధికారుల జాబితా సిద్ధం
-
మున్ముందు మరిన్ని సంచలనాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఏసీబీ పంజా విసరబోతోందా? ఇకనుంచి ఐఏఎస్ లను టార్గెట్ చేయనుందా? ఐపీఎస్ ల పై సైతం గురిపెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వ్యవస్థలోని కీలక అధికారులకు సంబంధించిన ఒక సమగ్రమైన దోపిడీ చిట్టాను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కులపై దాడికి రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల వివిధ కేసుల్లో బయటపడుతున్న అక్రమ ఆస్తులు, అంతర్గత శోధనలో లభించిన సమాచారం ఆధారంగా.. కీలక శాఖలో ఉన్నత పదవుల్లో ఉండి అక్రమార్చనలకు పాల్పడిన అధికారుల జాబితాను ఏసీబీ సిద్ధం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఈసారి ఏసీబీ వేస్తున్న అడుగులు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
చిన్న ఆధారంతో డొంక…
Also Read:లక్ష్మీతండాలో దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
ఇటీవల డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన అరెస్టు వెనుక ఆసక్తికరమైన అంశం ఉంది. 2019 నాటి పాత కేసు తవ్వి తీసి విచారించడంతో పాటు ఒక ట్రాన్స్ఫర్ పిటిషన్ లో వచ్చిన చిన్న ఆధారంతో లోతుగా శోధించింది. విల్లాలు, ప్లాట్లు, మైనింగ్ కంపెనీలో పెట్టుబడులతో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం.. ఏకంగా 150 కోట్లకు పైగా అక్రమస్తుల సామ్రాజ్యం బయటపడింది. ఇదే క్రమంలో డిస్కౌంట్లలో ఏడీఈ గా పనిచేసిన ఒక ఇంజనీర్ వద్ద ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు, భారీగా నగదును గుర్తించడం చూస్తుంటే అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం అవుతోంది.
పెరిగిన అవినీతి…
Also Read:తక్కువ ధరకే బంగారం అంటూ మోసం – కడపలో నకిలీ గోల్డ్ ముఠా బట్టబయలు
అవినీతి భారీ స్థాయిలో పెరిగింది. గతంలో కేవలం రూ.10,000 లేదా రూ.20,000 వరకు మాత్రమే లంచం కేసులు పరిమితం అయ్యేవి. ఏసీబీ ట్రాప్ లు ఇప్పుడు ఏకంగా వందల కోట్ల అక్రమ ఆస్తులను వెలుగు తీసేలా మారాయి. ఏకంగా బినామీ నెట్వర్కులను సైతం చేదిస్తోంది ఏసీబీ. గతంలో లంచాల ఆరోపణలు ఎదుర్కొని సురక్షితంగా బయటపడ్డామని భావిస్తున్న అధికారులు.. పాత ఫైళ్లను, జ్యుడీషియల్, సివిల్ విభాగాల్లో పని చేసిన అధికారుల వివరాలను సేకరించి సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.
సమగ్ర కసరత్తు…
Also Read:8 నెలల గర్భిణి దారుణ హత్య.. కన్నబిడ్డల ముందే భార్యను చంపిన భర్త
మున్ముందు అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ గట్టి ప్రయత్నాలు పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. ఐఏఎస్,, ఐపీఎస్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారుల ఇళ్లపై దాడులకు కూడా వెనుకడుగు వేయకుండా సమగ్ర కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బినామీల పేరుతో దాచిన డిజిటల్, రియల్ ఎస్టేట్ ఆధారాలను ఛేదించే కఠినమైన నెట్వర్క్ ను ఏసీబీ రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకముందు పెద్ద తిమింగలాలను బోనులో నిలబెట్టేందుకు తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు కానున్నాయి.
