క్రైం మిర్రర్ : చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. బస్వాపురం ప్రాజెక్టు వద్ద ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చేపల వేట కోసం బస్వాపురం ప్రాజెక్టుకు వచ్చారు. ఈ క్రమంలో చేపలు పడుతున్న సమయంలో నయీం అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపడి మునిగిపోయాడు. తోటి యువకులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి నీటిలో గల్లంతైన నయీం మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రాజెక్టులు, చెరువులు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
also read : లైంగిక బాధితుల గోప్యతకు హైకోర్టు కీలక నిర్ణయం – సోషల్ మీడియా దిగ్గజాలకు కీలక ఆదేశాలు
