Homeలైఫ్ స్టైల్ఆఫీసులో గంటకోసారి ఇలా చేస్తే.. వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

ఆఫీసులో గంటకోసారి ఇలా చేస్తే.. వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్:- జాబ్స్ చేసే ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి ఒక తాజా అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కదలకుండా కూర్చునే ఉద్యోగులు, తమ దైనందిన వ్యవహారాల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల షుగర్, ఊబకాయం, మరియు గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును తగ్గించుకోవడానికి, ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి కనీసం ఐదు నిమిషాల పాటు నడవాలని వారు సలహా ఇస్తున్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు దాదాపు 19,300 మంది ఉద్యోగుల ఆరోగ్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించారు. నిరంతరాయంగా కూర్చోవడం కంటే, మధ్యమధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు గుర్తించారు.మానసిక ఉల్లాసం కోసం..శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. దీని కోసం ప్రతి 30 నిమిషాలకోసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే మానసిక ఉల్లాసం మెరుగుపడుతుందని, తద్వారా పనిలో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై పుకార్లు.. మేనేజర్ క్లారిటీ!

వైసీపీలోకి ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు…?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు